ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేశంలోకి నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చినట్లు, కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. అందునా ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్లను పెద్ద సంఖ్యలో నకిలీ కేటుగాళ్లు చలామణిలోకి తెచ్చారని పేర్కొంది.వీటి విషయంలో ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఏజెన్సీలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో తయారుచేయడం వల్ల ఈ ఫేక్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందని అయితే, నకిలీ నోట్లపై ఒక చిన్న తేడాను గుర్తించినట్లు వెల్లడించింది. ప్రతీ నోటుపై తప్పనిసరిగా ఉండే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RESERVE BANK OF INDIA అనే అక్షరాల్లో ‘‘RESERVE’’ పదంలో ‘E’ బదులు ‘A’ పడినట్లు తెలిపింది. ఈ తేడాతో నకిలీ నోట్లను గుర్తించవచ్చని సూచించింది. ఈ సమాచారాన్ని డీఆర్‌ఐ, ఎఫ్‌ఐయూ, సీబీఐ, ఎన్‌ఐఏ, సెబీలతో కూడా పంచుకొంది. రూ.500 నోటును జాగ్రత్తగా పరిశీలించి చూశాకే తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది.
ఫేక్ రూ.500 నోట్లతో జాగ్రత్త… అప్రమత్తంగా ఉండాలని సూచించిన కేంద్ర హోం శాఖ
By admin1 Min Read