రాష్ట్ర శాసనసభలో రెండుసార్లు ఆమోదం పొందిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు తాజాగా గడువు నిర్దేశించిన తీర్పుపై దేశ రాజకీయాల్లో చర్చరేగింది. ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్,బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేస్తోందంటూ విమర్శించారు.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు పరోక్షంగా స్పందించింది.పశ్చిమబెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
‘‘మేమే పాలనలో జోక్యం చేస్తామంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో,ఇప్పుడు మేమే రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించింది.ధన్ఖడ్ వ్యాఖ్యల్లో, ‘‘సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య వ్యవస్థపై అణుక్షిపణి ప్రయోగిస్తోంది.న్యాయమూర్తులు శాసనాలు చేస్తారు,పాలనా విధులూ నిర్వర్తిస్తున్నారు.పార్లమెంట్ స్థానాన్ని అలవరచుకుంటున్నారని అన్నారు.బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరింత ముందుకెళ్లి, ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంటును మూసేయాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.