జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో నిన్న జరిగిన ఉగ్రవాదదాడిని పిరికిపంద చర్యగా రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పై కుట్ర చేస్తున్న వారిని వదలబోయేది లేదని స్పష్టం చేశారు. భారత్ ఈ దాడికి గట్టిగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి భారత ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పహాల్గాం ఘటనకు సంబంధించిన విషయాలు, శ్రీనగర్ లో భద్రతా చర్యలు వంటి అంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠితో రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరిపారు.
ఈ దాడికి భారత్ గట్టిగా బదులిస్తుంది: కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
By admin1 Min Read