పాకిస్థాన్ కు చెందిన పౌరులను గుర్తించి వారిని వెనక్కి పంపే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా నేడు మాట్లాడారు. ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని అన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్ లో పర్యటించేందుకు అవకాశం కల్పించారు. ఈ ప్రోగ్రాం కింద ఇక్కడ ఉన్న ఎవరైనా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక మెడికల్ వీసాలకు మాత్రం ఈనెల 29 వరకు గడువు విధించింది. పాకిస్థాన్ నుండి కొత్త వీసాల దరఖాస్తులకు వీసా సర్వీసులు నిలిపివేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్థాన్ లో ఉన్న భారత పౌరులను తిరిగి వచ్చేసేయమని అడ్వైజరీ జారీ చేసింది. ఇక్కడ ఉన్న పాక్ జాతీయులు కూడా వీలైనంత త్వరగా గడువు ముగిసే లోపు వెళ్లి పోవాలని ఆదేశించింది.
పాకిస్థాన్ జాతీయులు వారి దేశానికి వెళ్లిపోయేలా వేగంగా కేంద్రం చర్యలు… సీఎంలతో మాట్లడిన హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read