జమ్మూ కాశ్మీర్ లో టూరిస్ట్ లపై ఇటీవల జరిగిన దాడి తర్వాత కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తమై ఇక్కడ ఉంటున్న వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలో గుజరాత్లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నకిలీ ధ్రువపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుండి రాష్ట్రంలోని పలు నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్ లో 890 మందిని, సూరత్‌లో 134 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్ లో బోర్డర్ దాటి భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపారు. అక్కడ ఫోర్జరీ ప్రతాలు పొంది దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. అంతే కాకుండా వీరిలో చాలా మంది అసాంఘిక కార్యకలాపాలలో అనుమానితులుగా ఉన్నారు. వీరందరి డాక్యుమెంట్స్ పరిశీలించి భారత్ నుండి పంపించి వేస్తామని చెప్పారు.
గుజరాత్ పోలీసుల భారీ ఆపరేషన్:అదుపులోకి 1000 మందికి పైగా అక్రమ వలసదారులు
By admin1 Min Read