మెడికల్ రంగంలో రోబోటిక్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదేళ్లలో అత్యుత్తమ మానవ సర్జన్లను సైతం రోబోలు అధిగమించగలవని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్ని సంవత్సరాలలోనే మంచి సర్జన్లను, ఐదేళ్లలో అత్యుత్తమ సర్జన్లను రోబోలు అధిగమిస్తాయని మస్క్ పేర్కొన్నారు. తన బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ సంస్థ ‘న్యూరాలింక్’ కార్యకలాపాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చే ప్రక్రియ అత్యంత కచ్చితత్వంతో, వేగంగా జరగాలని, అది మానవులకు అసాధ్యమని, అందుకే తాము రోబోల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని మస్క్ వివరించారు.అమెరికాకు చెందిన మెడికల్ డివైస్ కంపెనీ ‘మెడ్‌ట్రానిక్’ సాధించిన రోబోటిక్ సర్జరీ విజయాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ మారియో నవ్‌ఫాల్ చేసిన పోస్ట్‌కు రిప్లై ఇస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రానున్న రోజుల్లో అత్యుత్తమ సర్జన్స్ ను రోబోలు అధిగమిస్తాయి: ఎలాన్ మస్క్
By admin1 Min Read