ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడి తర్వాత నుండి పాకిస్థాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా ఆయా వీసాల కింద భారత్ లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో పాక్ దేశీయులు భారత్ ను వీడారు. అక్కడ ఉన్న భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 24-29 మధ్య పంజాబ్లోని అటారీ- వాఘా సరిహద్దు గుండా 786 మంది పాకిస్థానీయులు స్వదేశానికి వెళ్లారు. అదే సమయంలో పాక్ నుంచి 1,376మంది భారతీయ తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక భారత్ లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. మెడికల్ వీసాల కింద వచ్చినవారికి ఈనెల 29 వరకు గడువు ఇచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టంచేసింది. మెడికల్ వీసాల గడువు నిన్నటితో ముగిసింది. గడువు ముగిసిపోవడంతో కేంద్రం ఆదేశాల మేరకు నేడు అధికారులు అటారీ-వాఘా సరిహద్దును మూసివేశారు. ఏప్రిల్ 4 నుండి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025′ ప్రకారం.. గడువు తీరినా ఇక్కడే ఉన్నా, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధిస్తామని భారత ప్రభుత్వం పాక్ దేశస్థులను హెచ్చరించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు