ఇటీవల జమ్ముకాశ్మీర్ లోని పహాల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుండి వచ్చే అన్ని పార్శిల్స్, మెయిల్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల పార్శిల్ ఎక్సేంజ్ లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్ నుండి భారత్ కు వచ్చే అన్ని డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించింది. పాకిస్థాన్ తో సముద్ర రవాణా మార్గాలను కూడా భారత్ మూసివేసింది. ఆకాశ మార్గాన్ని కూడా ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, ఎఫ్.ఏ.టీ.ఎఫ్ గ్రే లిస్టులోకి పాక్ ను తీసుకొచ్చేలా ప్రయత్నాలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలతో శత్రు దేశం పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాలని భావిస్తోంది.
పాక్ కు భారత్ మరో షాక్… అన్ని రకాల మెయిల్స్, పార్శిల్ ఎక్సేంజ్ నిలిపివేత
By admin1 Min Read