పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత్ తిరిగి ప్రతీకార దాడులు చేస్తుందోనని పాకిస్థాన్ వణికిపోతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు కేంద్రం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పౌరులకు అవగాహన కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 7 న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. 1971 తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇదే మొదటి సారి. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. శత్రు దేశాల నుంచి ఆకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పించేందుకే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్.
ఇక ఇందులో భాగంగా పలు కీలక అంశాలను కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. ఎయిర్ స్ట్రైక్స్ హెచ్చరిక సైరన్లను మోగించడం, భారత వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్ లు యాక్టివేట్ చేయడం, కంట్రోల్ రూమ్ లు మరియు షాడో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఇక రేపు మాక్ డ్రిల్ నిర్వహించే ప్రాంతాల జాబితాను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా రేపే సివిల్ మాక్ డ్రిల్… సన్నద్ధమవుతోన్న రాష్ట్రాలు
By admin1 Min Read