ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని తీవ్ర హెచ్చరికలు పంపారు. ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ఇది భారత్ స్పందనని తెలిపారు. మన దేశ భద్రతా బలగాల చర్యలపై ఎంతో గర్వంగా ఉంది. పహాల్గాం లో జరిగిన దారుణ హాత్యలకు ప్రతిస్పందించే ఈ ఆపరేషన్ అని స్పష్టం చేశారు. భారత్ పై దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైన తగిన రీతిలో స్పందించేందుకు మోడీ సర్కారు కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత్ లోని రాజకీయం సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పౌరులు భారత సాయుధ దళాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తాం: ఆపరేషన్ ‘సింధూర్’ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read