టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారత్ లో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఆయన ఈనెల 1న భారత్ కు వచ్చారు. భారతీయ సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్యలోని హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామాలయ దర్శనం చాలా అద్భుతమైన, మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. నేను ఇప్పటి వరకు చేసిన గొప్ప పనుల్లో ఇది ఒకటి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయం చాలా అందంగా ఉంది. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందంటూ ఎరోల్ మస్క్ వ్యాఖ్యానించారు. భారత్ లో పర్యటన అద్భుతంగా సాగుతుందని పేర్కొన్నారు. సర్వోటెక్ తో కలిసి పనిచేసేందుకు వచ్చానని చెప్పారు. దేశంలో ఎక్కువ సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను. దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కూడా అంతే అద్భుతంగా ఉన్నారు అంటూ ఎరోల్ మస్క్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక్కడ ఆలయాలు ప్రజలు అద్భుతం… అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్
By admin1 Min Read