అయోధ్య రామమందిరం లో తాజాగా రెండో విడత విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం వీనుల విందుగా నిర్వహించారు. మొదటి అంతస్తులో నిర్మించిన రాజదర్బారులో సీత సమేతంగా శ్రీరామచంద్రుడు రాజు హోదాలో కొలువు తీరాడు. అలాగే రామజన్మభూమి ఆలయ సముదాయ ఆవరణలో నిర్మించిన ఎనిమిది కొత్త ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ట పూర్తి చేశారు. గత సంవత్సరం జనవరి 22న ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన బాల రాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో ఇది రెండో ప్రధాన కార్యక్రమం. హిందూ పంచాంగం ప్రకారం అత్యంత విశిష్టమైన అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు యజ్ఞ మండపంలో పూజలతో ప్రతిష్ట క్రతువు మొదలైంది. తొమ్మిది గంటలకు యజ్ఞం, ఆ తర్వాత అన్ని చోట్లా విగ్రహ ప్రతిష్ట క్రతువు ప్రారంభించారు. ఆలయంలో బిగ్ స్క్రీన్ లపై ఈ వేడుక దృశ్యాలు చూపారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు వీటిని వీక్షించారు. ‘రామదర్బారు’ ప్రతిష్టతో అయోధ్య మరోసారి అందరం గర్వించదగిన చారిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిందనీ, రామ భక్తులలో ఇది ఆనందం నింపుతుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. రామదర్బారుతో పాటు ఈశాన్యంలో శేషావతారం, శివుడి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆగ్నేయంలో విఘ్నేశ్వరుడు, దక్షిణాన హానుమంతుడు, నైరుతిలో సూర్య భగవానుడు, వాయువ్యంలో భగవతీ దేవి, ఉత్తరాన అన్నపూర్ణ దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు