జమ్మూ కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ మహాదేవ్’ పేరుతో భారత భద్రతా దళాలు చేపట్టిన ఈ ఆపరేషన్ లో భాగమైన ముగ్గురు పహాల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఉన్నట్లు తెలిపారు. వాళ్లు లష్కరే తోయిబా కు చెందిన సులేమాన్, అఫ్గాన్, జిబ్రాన్ అని పేర్లు కూడా తెలిపారు. పహాల్గాం అమానుష ఘటనకు సంబంధించిన ముగ్గురు హాతమైనట్లు పార్లమెంటు వేదికగా ప్రకటించారు. ‘ఆపరేషన్ మహాదేవ్’ ద్వారా వారిని హాతం చేసిన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే వాళ్లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తమ ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ గురించి నేడు పార్లమెంటులో రెండో రోజు జరిగిన చర్చలో ఈ విషయాన్ని వివరించారు.
వారు పహాల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన
By admin1 Min Read