ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు చురకలంటించారు. ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయని అన్చేనారు. పార్లమెంటులో ఈ అంశంపై ప్రత్యేక చర్చలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక పోయరన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకేఒక్క అవకాశాన్ని కూడా వారు ఉపయోగించుకోలేకపోయారని సెటైర్లు వేశారు. తాజాగా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ భద్రత విషయంలో ప్రతిపక్ష ధోరణి, నేతల్లో అభిప్రాయ భేదాలు పార్లమెంటు చర్చలో బయటపడ్డాయని, ఇలాంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదని ఆక్షేపించారు. ఎప్పుడూ రాజ్యాంగం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు తాము అధికారంలో ఉన్నప్పుడు జమ్మూకశ్మీర్లో దానిని అమలుచేయలేదని విమర్శించారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు