తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ లపై టారిఫ్ ల వార్ కు తెరలేపిన సంగతి తెలిసిందే. ట్రంప్ టారిఫ్ వార్ పై భారత ప్రధాని మోడీ స్పందించారు. రైతుల ప్రయోజనాల విషయంలో భారత్ రాజీ పడదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. సుంకాల పెంపుతో నష్టం జరుగుతుందని తనకు తెలుసని అయితే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దేశంలోని రైతులు, మత్స్యకారుల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల గురించి ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని స్పష్టం చేశారు.
ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం: టారిఫ్ ల నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
By admin1 Min Read