ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాజాగా విడుదల చేసిన వీడియో మన దేశ భద్రతా దళాల సామర్థ్యానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాంలో టూరిస్ట్ లపై ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే నెలలో పాకిస్థాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా విరుచుకుపడి సత్తా చాటింది. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఏం చేయగలదో చాటి చెప్పింది. ఐఏఎఫ్ విడుదల చేసిన 5 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో ఈ ఆపరేషన్ వివరాలు ఉన్నాయి. ఈ వీడియోలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఫైటర్ జెట్లు జరిపిన వైమానిక దాడుల దృశ్యాలు, ధ్వంసమైన శిబిరాల చిత్రాలు ఉన్నాయి. ఇక తాజాగా బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ వివరాలను ధ్రువీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఐదు పాకిస్థానీ యుద్ధ విమానాలను, ఒక భారీ విమానాన్ని కూల్చివేసినట్లు చెప్పారు.
Indian Air Force -Touch the Sky with Glory#IndianAirForce#YearOfDefenceReforms@DefenceMinIndia@SpokespersonMoD@HQ_IDS_India@adgpi@IndiannavyMedia@indiannavy@CareerinIAF pic.twitter.com/FhFa3h8yje
— Indian Air Force (@IAF_MCC) August 10, 2025