అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లో మధ్య అలాస్కాలో జరిగిన చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఉక్రెయిన్ తో యుద్ధ విరమణకు ఒప్పందం కుదరలేదని, కానీ పుతిన్‌తో జరిగిన చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ ఈ సమావేశం తర్వాత చెప్పారు. ఇరువురు నేతలు అలాస్కా నుంచి తిరిగి వెళ్లిపోయారు.అలాస్కాలో ట్రంప్, పుతిన్ మధ్య సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది.
మీడియా సమావేశంలో ఇద్దరు నేతలు సమావేశం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. పురోగతి ఉందని పేర్కొన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని అన్నారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. మళ్లీ పుతిన్ ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ తెలిపారు.
ఇక రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్ తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ పేర్కొన్నారు.
ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిన డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ అలాస్కా చర్చలు
By admin1 Min Read