ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకెళ్తున్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లోని జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాలను ఆయన కైవసం చేసుకున్నారు. వీటితో పాటు మరో ఐదు స్వింగ్ రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ 247 ఎలక్టోరల్ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన జార్జియా, కాన్సస్, అయోవా, మోంటానా, యుటా, నార్త్ డకోటా, వయోమింగ్, సౌత్ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్ వర్జీనియా, అలబామా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, ఐడహో, నార్త్ కరోలినా రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. ఇక, అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 214 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలావేర్, మసాచుసెట్స్, రోడ్ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, న్యూహ్యాంప్ షైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాను సొంతం చేసుకున్నారు.
అమెరికా ఎన్నికల ఫలితాలు: మ్యాజిక్ ఫిగర్ వైపు దూసుకుపోతున్న ట్రంప్
By admin1 Min Read