జనాభా సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా వింత ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన ఒక కంపెనీ సింగిల్స్ డేటింగ్‌పై ఆసక్తి చూపించేలా ఆసక్తికర ప్రకటన చేసింది.దక్షిణ చైనాలోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కంపెనీలోని సింగిల్స్ ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి.అలా చేస్తే 66 యువాన్లు (భారత కరెన్సీలో రూ.770) ఇస్తారు.ఎవరైనా ఆకర్షితులు అయితే వారితో మూడు నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి.దీనికి ఒక్కొక్కరికీ వెయ్యి యువాన్లు (రూ.11,650) గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పింది.
Previous Articleహీరోలు డేట్స్ ఇవ్వలేదు : అమ్మ రాజశేఖర్
Next Article ఐదు కోట్ల నకిలీ రేషన్ కార్డులు..: కేంద్రం