మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ‘మహాయుతి’ ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు 221 స్థానాలలో విజయ ఢంకా మోగించింది. ఇంకా పలు స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ విజయం పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
అభివృద్ధి, సుపరిపాలనదే విజయం. ఐక్యంగా ముందుకుసాగితే భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలమని పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన మహారాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. మీరు చూపిన ప్రేమ అసమానమైనది. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని ఈసందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కృషిచేసిన కార్యకర్తలపట్ల గర్వంగా ఉందన్నారు. వారు ప్రజల మధ్యకు వెళ్లి, అధికార కూటమి సుపరిపాలన గురించి వివరించారన్నారు. ఇక జార్ఖండ్ లో విజయం సాధించిన జేఎంఎం కూటమికి ప్రధాని అభినందనలు తెలియజేశారు.
Previous Articleఈ విజయం ప్రజలదే: ప్రియాంక గాంధీ
Next Article సిద్దార్థ్ ‘మిస్ యూ’ ట్రైలర్ విడుదల…!