బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 తన సతీమణితో కలిసి త్వరలో భారత్ లో అధికారికంగా పర్యటించనున్నారు. ఆయన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మృతితో 2022లో ఛార్లెస్-3 భారత పర్యటన రద్దయింది. ఇక ఈ సంవత్సరం ప్రారంభం నుండి క్యాన్సర్ కు చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఆయనకు ఈ పర్యటన గొప్ప ఉపశమనంగా భావిస్తున్నారు. ఈ సారి పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో కూడా పర్యటించనున్నట్లు బ్రిటన్ మీడియా వెల్లడించింది. అక్టోబరులో తన భార్య క్వీన్ కెమెల్లాతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన బ్రిటన్ కింగ్ తిరుగు ప్రయాణంలో బెంగళూరులోని ఓ వెల్నెస్ కేంద్రంలో ఆగిన విషయం తెలిసిందే.
Previous Articleవిశ్వక్ సేన్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు?
Next Article సిఎం చంద్రబాబుపై రాళ్ళ దాడి కేసు రీ-ఓపెన్..!