మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇలా వస్తాయని అనుకోలేదు అని కాంగ్రెస్ ఎంపీ,రాహుల్ గాంధీ అన్నారు.మహారాష్ట్రలో బీజేపీ కూటమి మహాయుతి 232 సీట్లు, కాంగ్రెస్ తో కూడిన ఎంవీఏ కూటమి 52 సీట్లు గెలుచుకుంది.మహారాష్ట్రలో దారుణ పరాభవంపై రాహుల్ గాంధీ స్పందించారు.మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తామని చెప్పారు.ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియా కూటమికి ఇంతటి మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.విజయం సాధించినందుకు గాను సీఎం హేమంత్ సోరెన్, పార్టీ కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు.
మహారాష్ట్ర ఫలితాలను విశ్లేషిస్తాం :- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
By admin1 Min Read