బాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ బాద్‌షాకు చెందిన సెవెల్లె క్లబ్‌పై బాంబు దాడి జరిగింది.చంఢీగర్‌లోని సెక్టార్ 26లో ఉన్న ఈ క్లబ్‌పై ఇద్దరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు.ఈరోజు తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్య క్తులు బైక్ వచ్చి.. lక్లబ్‌పై బాంబు విసిరి అక్కడి నుంచి పారిపోయారు.
ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది ఎవరు? ఎందుకు ఇలాంటి పనులకు పాల్పడ్డారు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారని టాక్.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని సమాచారం.ఏబీసీడీ 2, ఆల్ ఈజ్ వెల్, కపూర్ అండ్ సన్స్, ఓకే జాను, వేదాళం, స్త్రీ, సాహో , జవాన్ వంటి చిత్రాల్లో బాద్‌షా పాటలు పాడారు.ఆయన ఆలపించిన స్పెషల్ సాంగ్స్ కూడా మంచి ఫేమ్ అందుకున్నాయి.

