నిజమైన విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని సుప్రీంకోర్టు పేర్కొన్నది.ఇది రిజర్వేషన్ల విధానానికే విరుద్ధమని, రిజర్వేషన్ల లక్ష్యాన్ని ఓడించడమేనని స్పష్టం చేసింది. సెల్వరాణి అనే మహిళ హిందూ తండ్రి, క్రైస్తవ తల్లికి జన్మించింది.పుట్టిన కొన్నిరోజులకే బాప్టిజం తీసుకొని,క్రైస్తవాన్ని ఆచరిస్తుంది.పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు తన తండ్రి కులమైన వెల్లువన్‌గా తనకు ఎస్సీ సర్టిఫికెట్ జారీ చేయించాలని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.ఆమె వినతిని హైకోర్టు జనవరి 24న తిరస్కరించింది.దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పంకజ్ మితల్, జస్టిస్ ఆర్ మహదేవన్..హైకోర్టు తీర్పును సమర్థిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు.
రిజర్వేషన్ల కోసం.. మతం మారడం రాజ్యాంగాన్ని మోసగించడమే: సుప్రీంకోర్టు
By admin1 Min Read