తెలియని వ్యక్తులు నుంచి ఫోన్ కాల్స్ వస్తే వాటిని ఆన్సర్ చెయ్యొద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు విభాగం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ముఖ్యంగా + 94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే అస్సలు ఎత్తవద్దని చెప్పింది. +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్స్ ఉన్న నంబర్స్ నుంచి ఫోన్ వస్తె.. కాల్ లిఫ్ట్ చేసిన మూడు సెకన్ల లోనే మన వివరాలు కాపీ చేసుకుంటారని తెలిపింది. అంతే కాకుండా కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగి.. తద్వారా మన వివరాలు సేకరించి మనల్ని నేరస్తులుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని చెప్పింది.
Previous Articleఅయ్యప్ప భక్తులకు రైల్వే సూచనలు…!
Next Article చిలకడ దుంప తినండి.. అందాన్ని పొందండి..