భారతదేశ రవాణా వ్యవస్థలో సరికొత్త శకానికి కీలక ముందడుగు పడింది. చెన్నై సమీపంలో ఐఐటీ మద్రాస్, భారతీయ రైల్వే శాఖ కలిసి నిర్మించిన 410 మీటర్ల హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తయ్యింది. దీనిని ఐఐటీ మద్రాస్ ఆవిష్కార్ హైపర్ లూప్ బృందం, టూటర్ అనే స్టార్టప్ సంస్థ మరియు ఇండియన్ రైల్వే లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ టెక్నాలజీని పరీక్షించడం కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ట్యూబ్ వాక్యూమ్ ద్వారా అయస్కాంత సాంకేతికత ఆధారంగా నడిచే అత్యంత వేగవంతమైన రైలు ఇది.
దేశంలో ముంబై-పుణె కారిడార్లో మొదటి హైపర్ లూప్ రైలు సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆతర్వాత చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-చండీఘఢ్ మధ్య కూడా హైపర్ లూప్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక వీటి వలన కలిగే ఉపయోగాలు ముఖ్యంగా ప్రయాణ సమయం బాగా ఆదా అవుతుంది. విద్యుత్ వినియోగం , కాలుష్యం , ఇంధన వినియోగం వంటివి గణనీయంగా తగ్గుతాయి. ఈ హైపర్ లూప్ హైస్పీడ్ రవాణా వ్యవస్థను 2013 మధ్యలో మొదటిసారిగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

