భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా కలినిన్‌గ్రాడ్ లోని యంటార్ షిప్‌యార్డ్‌ను సందర్శించారు. మల్టీ-రోల్ స్టెల్త్-గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ఐ.ఎన్.ఎస్ తుషిల్ ను నౌకాదళానికి అందించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐ.ఎన్.ఎస్ తుషిల్ నౌక భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. రష్యాతో దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఐ.ఎన్.ఎస్ తుషీల్ (F70) అనేది భారత నౌకాదళానికి చెందిన తల్వార్ -క్లాస్ ఫ్రిగేట్ . ఐఎన్‌ఎస్ తుషిల్’ యొక్క బరువు 3,900 టన్నులు కాగా, పొడవు 125 మీటర్లు.ఈ యుద్ధ నౌకలో భారత పరిజ్ఞానం 26 శాతం వరకు ఉంది. ఇందులో శక్తిమంతమైన ఆయుధాలు ఉంటాయి. వాటిలో గైడెడ్ మిసైళ్లను, అధునాతన రాడార్లు, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. ఈ నౌక చేరికతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరిగింది. 2016లో భారత్- రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు, 250 కోట్ల డాలర్ల విలువతో నాలుగు స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌకల నిర్మాణం మొదలైంది. వాటిలో రెండు యుద్ధనౌకలను రష్యాలో, మిగతా రెండు యుద్ధనౌకలను భారత్‌లో నిర్మించాలని నిర్ణయించారు.
Previous Articleసినిమా సక్సెస్ అయిన ఎవరి మద్దతు నాకు రాలేదు: హీరో
Next Article నేనో తెలివితక్కువ వాడిని… బైడెన్

