పశ్చిమ కనుమల్లో జీవవైవిధ్య సంరక్షణకు చేసిన కృషికి ప్రముఖ జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కు ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ పురస్కారం 2005లో స్థాపించబడింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (UNEP) కింద ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ప్రకటించే పురస్కారం అత్యున్నతమైనది.
2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన 14 సభ్యుల మాధవ్ గాడ్గిల్ కమిటీ అద్భుతమైన జీవావరణానికి, అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న జీవజాతులకు ఆలవాలమైన పశ్చిమ కనుమలను పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన జోన్లుగా విభజించాలంటూ 2011 ఆగస్టు 31న కేంద్రానికి నివేదికను ఇచ్చింది.
ఇక ఈ పురస్కారాన్ని 2009 లో తులసి తంతి, 2018లో ప్రధాని మోడీ, 2022లో పూర్ణిమా దేవి బర్మాన్ ఇదివరకు అందుకున్న భారతీయులుగా ఉన్నారు.
ప్రముఖ జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కు ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ పురస్కారం
By admin1 Min Read
Previous Articleమంత్రి పై నాగార్జున పరువూ నష్టం దావా.. విచారణ వాయిదా
Next Article కేజ్రీవాల్ హామి…ప్రతినెలా రూ.2100…!