భారత రాజ్యాంగంపై లోక్ సభ, రాజ్యసభలలో రెండు రోజుల పాటు చర్చ జరిగనుంది. రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈమేరకు చర్చ జరపాలని నిర్ణయించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ నూతన రాజ్యాంగం ఆమోదించింది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇక ఈ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ జరగాలని కాంగ్రెస్ ప్రధానంగా డిమాండ్ చేసింది. ఈమేరకు అధికార, విపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక నేడు లోక్ సభలో నేడు రాజ్ నాథ్ సింగ్ దీనిని ప్రారంభిస్తారు. రాజ్యసభలో అమిత్ షా ఈనెల 16న ప్రత్యేక చర్చను ప్రారంభిస్తారు. 17న ప్రధాని మోడీ ఈచర్చపై ముగింపు ప్రసంగం చేస్తారు. పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఇప్పటికే ప్రధాని మోడీ వ్యూహాత్మక సమావేశం నిర్వహించారు. బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు ఈచర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించి చర్చించారు. ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు