బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. దీనిపై ఆయన లోక్ సభలో మాట్లాడారు. బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను నివారించేందుకు హిందువులు, మైనారిటీల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశీస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులపై అక్కడి నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇక బంగ్లాదేశ్ లో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి వెళ్లిపోవడం తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు జరిగాయి. వీటికి వ్యతిరేకంగా గళం విప్పిన ఇస్కాన్ కు చెందిన చిన్మయి కృష్ణదాస్ ను అరెస్టు చేయడం ఆయనకు కనీసం న్యాయ సహాయం కూడా అందించకపోవడం కూడా బంగ్లాదేశ్ తీరును ఎండగడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవతా వాదులు మండిపడుతున్నారు. ఆగష్టు 5 నుండి అక్టోబర్ 22 మధ్య మైనారిటీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఇటీవల బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక నివేదికలో పేర్కొంది.
మైనారిటీల రక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి: కేంద్ర మంత్రి జై శంకర్
By admin1 Min Read
Previous Articleబంగ్లాదేశ్ లో దాడులు.. వైట్ హౌస్ కీలక ప్రకటన
Next Article నష్టాల నుండి కోలుకుని లాభాల బాటలో సూచీలు జోరు