యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుంది.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధ్య ఆసియాలో శాంతి, సుస్థిరత, భద్రతకు భారత్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గతంలో ఎన్నడూ లేనివిధంగా పురోగతి సాధించిందని అన్నారు. ఐఎంఈఈసీ (ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్) అమలును ఒక చారిత్రాత్మక చొరవగా అభివర్ణించారు.
ప్రధాని మోడీతో యూఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జయద్ అల్ నహ్యాన్ భేటీ
By admin1 Min Read
Previous Articleనష్టాల నుండి కోలుకుని లాభాల బాటలో సూచీలు జోరు
Next Article అల్లు అర్జున్ కు షాక్…14 రోజుల రిమాండ్…!