పశ్చిమాసియా దేశమైన సిరియాలో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితుల గురించి తెలిసిందే. ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని డమాస్కస్ లో ప్రవేశించడంతో అధ్యక్షుడు బషర్-అల్-అసద్ దేశాన్ని వీడారు. దీంతో పూర్తిగా తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లింది. బషర్-అల్-అసద్ కుటుంబంతో పాటు సిరియా వదిలి రష్యాకు శరణార్థిగా వెళ్లిపోయారు.
ఇక అక్కడ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికా సిరియాతో తమ సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కడి తిరుగుబాటు దారులతో టచ్ లో ఉన్నట్లు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సిరియా రెబల్స్ తో ప్రత్యక్ష సంబంధాలు: వెల్లడించిన ఆంటోనీ బ్లింకెన్
By admin1 Min Read
Previous Articleవేడుకగా పీవీ సింధు ఎంగేజ్మెంట్
Next Article ఆసుపత్రిలో ఎల్ కే అద్వానీ …!

