కాంగ్రెస్ దేశంలో అవాస్తవాలను వ్యాప్తిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాజ్యసభలో నిన్న తాను చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు వ్యతిరేకమని విమర్శించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిన తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, రాజ్యాంగ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ ఏనాడూ అంబేడ్కర్ స్మారకాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అంబేద్కర్ ను గౌరవించింది తమ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. ఎన్నడూ అంబేద్కర్ ను అవమానించని పార్టీ నుంచి తాను వచ్చానని అమిత్ షా అన్నారు. స్పష్టంగా తన ప్రసంగం రాజ్యసభ రికార్డుల్లో ఉందని పేర్కొన్నారు. కలలో కూడా అంబేద్కర్ ఆలోచలను అవమానించలేని పార్టీ, సిద్ధాంతం నుంచి వచ్చానని అమిత్ షా అన్నారు. రాజ్యసభలో తన పూర్తి ప్రసంగాన్ని ప్రజలకు మీడియా చూపించాలని కోరారు.
కాంగ్రెస్ ఆ వ్యాఖ్యలు వక్రీకరించింది: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
By admin1 Min Read