పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, నేడు పార్లమెంటు ఆవరణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ ను అవమానించిదని అధికార పార్టీ కూడా నిరసనలు చేపట్టింది.
ఇందులోభాగంగా పార్లమెంట్ లోపలకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఒడిశా ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి గాయపడ్డారు.
అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడ్డారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది . దీంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని ఆయన వచ్చి తనపై పడటంతో కిందపడ్డానని పేర్కొన్నారు.
దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు తనను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తోసేశారు. బెదిరించారని ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారని తమకు లోపలికి వెళ్లే హక్కు ఉందని పేర్కొన్నారు.
Odisha BJP MP Pratap Sarangi sustained injuries, when Rahul Gandhi pushed another MP, causing him to fall on Sarangi.
The sheer nonchalance and arrogance of Gandhi scion is for all to see. Congress leadership is now restoring to physical assaults… pic.twitter.com/62EQ8xQoqa— Amit Malviya (@amitmalviya) December 19, 2024