ఈరోజు పార్లమెంట్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం తప్పుబట్టింది.అయితే ప్రతిపక్షం అంబేద్కర్ ను తక్కువ చేస్తున్నారని అధికార పక్షం పేర్కొంది.అధికార,ప్రతిపక్షాలు నిరసలతో పార్లమెంట్ వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తింది.అయితే ఈ క్రమంలో పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఒకరినొకరు అడ్డగించుకున్నారు.ఈ మేరకు ఒడిశాకు చెందిన ఓ బీజేపీ ఎంపీ క్రిందపడిపోగా..ఆయన తలకు గాయాలు అయ్యాయి.బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుండి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఇది గుర్తించిన నేతలు ఆయనను ఓ చోట కూర్చోబెట్టి…చికిత్స చేయించే ప్రయత్నం చేశారు. ఆయనను రాహుల్ గాంధీ నెట్టేశారని ప్రతాప్ చంద్ర సారంగి చెప్పారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు