పార్లమెంటులో నిన్న తోపులాట జరిగిన నేపథ్యంలో తీవ్ర కలకలం రేపుతోంది.లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది.పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని బీజేపీ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సహచర ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారం ఇచ్చిందని నిలదీశారు.ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా.?’ అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.ఈ మేరకు రాహుల్ గాంధీపై…దాడి,ప్రేరేపణపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు.ఆయనపై సెక్షన్ 109,115,117,125,131,351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.సెక్షన్ 109 హత్యాయత్నం అని పేర్కొన్నారు.ఈ ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి,ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.వీరిని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.ప్రధాని నరేంద్రమోదీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు.ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
Previous Articleరాజ్యసభ చైర్మన్ పై ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణ
Next Article కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల…!