భారత జాతీయ లోక్ దళ్ అధ్యక్షుడు,హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా (89) కన్నుమూశారు.నిన్న రాత్రి ఆయనకు గుండె పోటురాగా,ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.మాజీ ఉపప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణాకు 4 సార్లు 1989 నుండి 2005 వరకు హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఓం ప్రకాశ్ చౌతాలా మృతిపై హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ట్వీట్ చేశారు. ‘చౌతాలా మరణం చాలా బాధాకరమని , ఆయనకు నా నివాళులు..ఆయన తన జీవింతాంతం రాష్ట్రానికి, సమాజానికి సేవ చేశారు.ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు’ అన్నారు.ఓం ప్రకాశ్ చౌతాలా మృతి పట్ల హరియాణా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకుడు మల్లీకార్జున ఖర్గే సంతాపం తెలిపారు.