అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.చాంద్రాయణగుట్టలోని CRPF గ్రూప్ సెంటర్‌లో ఈరోజు నిర్వహించిన రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, నియామక పత్రాలు అందించారు.
కేంద్ర ప్రభుత్వ రంగంలో ఖాళీలను త్వరగా భర్తీ చేస్తాం :- కేంద్ర మంత్రి బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పలు పోస్టులను త్వరితగతిన భర్తీ చేయాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.హైదరాబాద్ హకీంపేటలోని NISAలో నిర్వహించిన రోజ్ గార్ మేళాలో మంత్రి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు.