పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ..కరెంట్ బిల్లుల పెంపుని నిరసిస్తూ డిసెంబరు 27న రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించింది. కాగా, వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలపై వాళ్లే తగ్గించమని వాళ్లే ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం జగన్ రెడ్డిది కాదా.. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలను పెంచాలని ఈఆర్సీని కోరింది నిజం కాదా..? పీపీఏలను రద్దు చేసి, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణమైంది జగన్ రెడ్డి కాదా..? అని ప్రశ్నించారు 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఏపీ జెన్కో సర్వనాశనానికి కారకుడైన జగన్ రెడ్డి తన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఇలా ధర్నాల పేరుతో ఆడుతున్న డ్రామాలను ఏపీ ప్రజలు నమ్మరని మంత్రి ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా సిగ్గులేకుండా మళ్లీ అబద్ధపు ప్రచారాలతో నాటకాలు ఆడుతున్న జగన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని దుయ్యబట్టారు.
తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదం: మంత్రి గొట్టిపాటి రవికుమార్
By admin1 Min Read