సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన,సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు.మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని వ్యాఖ్యానించారుఈ ఘటనలో అల్లు అర్జున్‌ను దోషిగా చేయడం సరికాదన్నారు.‘‘గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు.అభిమాని మృతి చెందిన వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. అల్లు అర్జున్ కాకపోయినా ఆయన టీమ్ అయినా స్పందించాల్సింది.సంతాపం తెలపాల్సింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఆయన్ని అరెస్ట్ చేశారనడం సరికాదురేవంత్ గొప్ప నాయకుడు.కిందిస్థాయి నుంచి ఎదిగారు.బన్నీ స్థానంలో ఎవరు ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ కృషి చేశారు.
వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదు.బెనిఫిట్ షో టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం ఇచ్చారు.అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు.తెర ముందు,వెనుక ఏం జరిగిందో నాకు సరిగ్గా తెలియదు.ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను.ముందు భద్రత గురించి వారు ఆలోచిస్తారు.చిరంజీవి కూడా గతంలో అభిమానులతో కలిసి సినిమాలు చూసేందుకు వెళ్లేవారు.కాకపోతే ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు’’ అని పవన్ అన్నారు.

