2047 స్వర్ణాంధ్ర విజన్ లో, నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.టీడీపీ ప్రభుత్వంలోనే నీటి భద్రతకు అడుగులు పడ్డాయని పేర్కొన్నారు.
తెలుగు గంగతో అన్న ఎన్టీఆర్ రాయలసీమని ఆదుకున్నారు. సాగునీరు అందిస్తే, రాయలసీమ రతనాలసీమ అవుతుందని పేర్కొన్నారు . ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. ప్రణాళికతో నీటిని స్టోరేజ్ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 74% నీళ్ళు ఉన్నాయని వివరించారు. జనవరి నెలలో, ఇంత నీరు ఉండటం ఒక చరిత్ర. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తామని పేర్కొన్నారు.
గోదావరి – వంశధార – నాగావళితో ఉత్తరాంధ్రకు, ఇటు గోదావరి – కృష్ణా ద్వారా రాయలసీమకు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గోదావరి – కృష్ణా అనుసంధానం ప్రాజెక్ట్ కోసం, “తెలుగు తల్లికి జల హారతి” అని పేరు పెట్టాం. గోదావరి నుండి బనకచర్లకు లింక్ ఏర్పాటు చేస్తే, రాయలసీమకు ఇక తిరుగు ఉండదని ఇది గేమ్ ఛేంజర్ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అనేక లిఫ్టులు, టన్నెల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

