ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్వరం చేయూత అందించి ఇద్దరు దివ్యాంగులకు అండగా నిలిచారు. ఇటీవల అన్నమయ్య జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు, రాయచోటి వద్ద తనను కలిసి తమ సమస్యలు చెప్పుకున్న అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డి పల్లి మండలానికి చెందిన 90% వైకల్యం కలిగిన దివ్యాంగులు కట్ట ఆదినారాయణ, కాల్వ చంద్రశేఖర్ కు తన క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వం తరఫున రెండు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ స్కూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు.
తమ సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అందజేసిన డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read