రాష్ట్రంలో ఉదయం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. 63,77,943 మందికి పెన్షన్లు పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది కొత్త సంవత్సరం నేపథ్యంలో జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒకరోజు ముందుగానే నేడు పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. పల్నాడు జిల్లా యల్లమందలో లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు.
శారమ్మ అనే లబ్దిదారికి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ నగదు అందజేసి, ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్నారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు.
మరో లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికెళ్లిన సీఎం. దీపం పథకం గురించి ఆరా తీసి, ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేసి, కుటుంబ సభ్యులకు అందించారు. ఏడుకొండలు కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, అతను దుకాణం పెట్టుకునేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల రుణం ఇప్పించాలని… అలాగే ఇంటి నిర్మాణం పూర్తి కోసం కూడా రుణం ఇప్పించాలని అధికారులను ఆదేశించారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

