ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది.
రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు:
అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులు , సీఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదం.
మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్సు కు కేబినెట్ అంగీకారం.
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు ఆమోదం.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అంగీకారం.
ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం.
కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.
కడప, నంద్యాల, కర్నూల్ జిల్లాల్లో సోలార్, విండ్ ప్లాంట్లు ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.
రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర వ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్ల కోసం, కావాల్సిన భూమి ఇవ్వటానికి క్యాబినెట్ ఆమోదం.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు