విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. 66 కి.మీ మేర విజయవాడ మెట్రో, 76.90 కి.మీ మేర విశాఖ మెట్రో ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇప్పటికే డీపీఆర్ లు ఆమోదించారు. డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో మంత్రులు పి.నారాయణ, బిసి జనార్థన్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీవీపై పుస్తకం… అందుకున్న సీఎం:
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు, ఆయన రాజకీయ జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ అప్పరుసు కృష్ణారావు రచించిన పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు నేడు అందచేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు