నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో ఏర్పాటు చేసిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందితే రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం కూడా పుంజుకుంటుందన్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగానికి పునాది పడినప్పుడే ఈ సంస్థ కూడా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీకి ప్రోత్సాహం అందిస్తున్నాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయిన ప్రజా రాజధాని అమరావతిలో 50వేల కోట్లతో పనులు ప్రారంభం కానున్నట్లు వివరించారు. ఐదేళ్ల విధ్వంసంతో, అమరావతితోపాటు నిర్మాణ రంగాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టాడని అన్నారు. ఇసుక మాఫియాతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టాడని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ నినాదంతో పునర్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత ఇసుక విధానం అమలు చేసి నిర్మాణ రంగం, దాని అనుబంధ రంగాలకు చేయూతని అందించామన్నారు.
రాష్ట్రాన్ని పునర్‌నిర్మిస్తాం…నిర్మాణరంగానికి అండగా ఉంటాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read