తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బ్రిటిష్ వారిపై రాజీలేని పోరాటం చేసిన వడ్డే ఓబన్న లాంటి పోరాట యోధుల చరిత్ర నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు. కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా వడ్డే ఓబన్న పోరాడారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా నిర్వహించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామని పేర్కొన్నారు.
వడ్డే ఓబన్న లాంటి పోరాట యోధుల చరిత్ర నేటి యువతకు తెలియాలి: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read
Previous Articleస్కిల్ సెన్సెస్ కి శ్రీకారం చుట్టాలి:స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
Next Article తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణలు