ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశం లోనే తొలిసారిగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాలపై స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన నైపుణ్య గణన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని మరింత అర్థవంతంగా, సులభతరంగా రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టాలని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా మన యువత అందిపుచ్చుకునే విధంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఆయా దేశాల భాషలు అభ్యసించేలా కోచింగ్ ఇవ్వాలని సూచించారు. స్కిల్ సెన్సెస్ పూర్తయ్యాక యువతను వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
స్కిల్ సెన్సెస్ కి శ్రీకారం చుట్టాలి:స్కిల్ డెవలప్ మెంట్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
By admin1 Min Read