నేడు కృష్ణా జిల్లా, కొండపావులూరు గ్రామంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదరన్ క్యాంపస్ (NIDM) ప్రారంభోత్సవం, NDRF 20వ రైజింగ్ డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. హుద్ హుద్ అప్పుడు విజయవాడ వరదలు సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చూపించిన చొరవను కొనియాడారు . ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కోసం నాడు భూములు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. నేడు కేంద్ర సహకారంతో అవి పూర్తి చేసాం. అమిత్ షా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. విపత్తుల్లో కొన్ని లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడిందని అలాంటి సంస్థ మన రాష్ట్రంలో రావటం గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని తెలిపారు . అమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చారని ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కేంద్రం మార్గదర్శకంలో పోలవరం డయాఫ్రమ్ పనులు మొదలయ్యాయని కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్ధికసాయం చేసి ప్రాణం పోసిందని ఇటీవల విశాఖ రైల్వేజోన్ కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలని గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు