అండర్-19 మహిళల ప్రపంచ కప్-2025 లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ గెలుపుతో శుభారంభం చేసింది. తాజాగా నేడు వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 13.2 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటయింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు నిలబడి లేకపోయారు. పరుగులు చేయడంలో తడబడ్డారు. అసబి క్యాలెండర్ (12), కెనికా కాసర్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్లలో పరుణికా సిసోడియా 3, జోషిత 2, ఆయుషి శుక్లా 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి తేలికగా ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (4) కమిలిని (16 నాటౌట్), సానికా చాల్కే (18నాటౌట్) పరుగులు చేశారు.
అండర్-19 మహిళల ప్రపంచ కప్ లో భారత్ శుభారంభం: వెస్టిండీస్ పై 9 వికెట్ల తేడాతో విజయం
By admin1 Min Read